AMARAVATHIPOLITICS

అవిశ్వాస తీర్మానంపై విపక్షాలకు ప్రధాని ఘాటు సమాధానం

అమరావతి: విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సన్నగిల్లి పోతోందని,,ప్రతివిషయాన్ని రాజకీయంచేసేందుకు ప్రయత్నిస్తున్నయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు..గురువారం ప్రభుత్వం మీద విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‭సభకు హాజరైన మోదీ.. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. రాజ్యాంగం,,ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు.. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్ కాదని,,అది విపక్షాలకు ఫ్లోర్ టెస్ట్ అని అన్నారు.. విపక్షాల అవిశ్వాస ప్రస్తావన తమకు ప్రయోజనకరమంటూ2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన గుర్తు చేశారు.. ఆ సమయంలో తమపై అవిశ్వాసం పెట్టారని,, అది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చిందని మోదీ చురకలు వేశారు.. విపక్షాలు పిచ్ తయారు చేసి ఫీల్డింగ్ తయారు చేసిందని అయితే ఆట మాత్రం ప్రభుత్వం వైపు నుంచి నడుస్తోందని సిక్సర్లు తాము కొడుతున్నామని మోదీ అన్నారు. వాస్తవానికి విపక్షాలు సబ్జెక్ట్ మీద సరిగా తయారుకాలేదని,,తాను ఐదేళ్లు వారికి అవకాశం ఇచ్చినప్పటికీ ఏమాత్రం వినియోగించుకోలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.. విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని మోదీ అన్నారు. ఆయనను విపక్ష నేతను చేసినప్పటికీ మాట్లాడడానికి కనీసం అవకాశమే ఇవ్వలేదని దెప్పిపొడిచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *