AMARAVATHIDISTRICTS

న్యూ జర్నలిస్టు హౌసింగ్ సోసైటీలో అనధికార నిర్మణాలు-కార్పరేషన్ అధికారులు ఎక్కడ ?

ప్రార్దన మందిరాల  నిర్మాణం…

నెల్లూరు: నెల్లూరు రూరల్ పరిధిలోని న్యూ జర్నలిస్టు హౌసింగ్ సోసైటీలో బాపిటిస్ట్ చర్చి ఏర్పాటు చేసేందుకు బుధవారం ఇంటి యాజమాని ప్రయత్నించడంతో,,సదరు ప్రాంతంలోనే నివసిస్తున్న జర్నలిస్టులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు..స్థానిక జర్నలిస్టులు,ఇతరలు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు దగ్గరలో ఉన్న న్యూ జర్నలిస్టు హౌసింగ్ సోసైటీలో,దాదాపు 13 సంవత్సరాల క్రిందట ప్రభుత్వం కొంత మొత్తం నగదను జర్నలిస్టుల నుంచి వసూలు చేసి,,వారు ఇళ్లను నిర్మించుందుకు స్థలంను కేటాయించి రిజిస్ట్రేషన్ చేసింది.. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుండడంతో,, సహజంగానే స్థలాల ధరలు పెరిగాయి..దింతో చాలా మంది సభ్యులు హౌసింగ్ సోసైటీలో తమ స్థలాలను బయటకు వ్యక్తులు అమ్ముకున్నారు.. హౌసింగ్ సోసైటీ నిబంధనల విషయం తెలియని బయట వ్యక్తులు స్థలాలను కొనుగొలు చేసి ఇళ్ల నిర్మాణలు ప్రారంభిస్తున్నారు..ఈ నేపథ్యంలో హౌసింగ్ సోసైటీలోని 212 ప్లాట్ లో చర్చి ప్రారంభించేందుకు ఇంటిని నిర్మించిన రాజా అనే వ్యక్తి బుధవారం బ్యానర్ కట్టి,, చర్చి ప్రారంభించేందుకు ప్రయత్నించారు..

న్యూ జర్నలిస్టు హౌసింగ్ సోసైటీలో సదరు వ్యక్తికి ఇంటి నిర్మించుకునేందుకు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగ్ ప్లాన్ ను అనుమతులు ఇచ్చారా ? ఇంటిని నిర్మించడమే కాకుండా,,అక్కడ చర్చి ప్రారంభించేందుకు ప్రయత్నించడం చూస్తూంటే,కార్పరేషన్ లోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏ స్థాయిలో నిర్లలక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆర్దమౌతుంది.. కార్పరేషన్ కమీషనర్ తక్షణమే స్పందించి ఈ సంఘటనపై తగిన చర్యలు చేపట్టాలని హౌసింగ్ సోసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *