x
Close
AGRICULTURE BUSINESS CRIME DEVOTIONAL EDUCATION JOBS HEALTH MOVIE NATIONAL SPORTS

భారీ వర్షంలో రోడ్లకు మరమ్మత్తులు-నాలుగురు అధికారులు సస్పెండ్

భారీ వర్షంలో రోడ్లకు మరమ్మత్తులు-నాలుగురు అధికారులు సస్పెండ్
  • PublishedJuly 12, 2022

అమరావతి: రాష్ట్రంలో గుంటలు పడిన రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్న సమయంలో,, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో గుంటలు పడిన రోడ్లను పూడుస్తున్న నాలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు..ఆసలు విషయంలోకి వెళ్లితే,,,హోషియార్‌పూర్‌లోని షెర్పూర్ డకో గ్రామంలో కుండపోత వాన కురుస్తుండగా, వీరు రోడ్లు వేశారు. దీన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..ఇది కాస్తా వైరల్ కావడంతో భారీ వర్షంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు.. ప్రజాపనుల విభాగానికి చెందిన సబ్ డివిజనల్ ఇంజినీర్ తర్సెమ్ సింగ్, జూనియర్ ఇంజినీర్లు విపన్ కుమార్, పర్వీన్ కుమార్, జస్బీర్ సింగ్‌లను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.