DISTRICTS

వీధి కుక్కల బెడదపై 9553219996 వాట్సాప్ నెంబరు ఫిర్యాదు చేయండి-NMC కమిషనర్

పన్ను వసూళ్ల లక్ష్యాలను పూర్తి..

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలం, వాణిజ్య ప్రకటనల పన్నులతో పాటు ప్రతి ఇంటి నుంచి యూజర్ చార్జిల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిషనర్  సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ ల ఆవశ్యకతపై వ్యాపార వర్గాలకు అవగాహన పెంచి, నగర వ్యాప్తంగా అన్ని షాపులను లైసెన్సుల పరిధిలోకి తేవాలని శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో (క్లాప్) భాగంగా ప్రతీ ఇంటినుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలని, యూజర్ చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయాల వారీగా పన్నుల లక్ష్యాలను నిర్దేశించి, వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ అడ్మిన్, వి.ఆర్.ఓ, ప్లానింగ్ కార్యదర్శులను సమన్వయం చేసి రీ సర్వే పనులను వేగవంతం చేయాలని, సర్వేలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరచాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయాల వారీగా రీ సర్వే పనులను పూర్తి చేసి, రికార్డులను పదిలపరచాలని కమిషనర్ సూచించారు.

అన్ని డివిజనుల్లో వీధి కుక్కల నియంత్రణకై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, కుక్కలపై ఫిర్యాదులను 9553219996 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *