AMARAVATHICRIME

తిరుమలలో అడవి మృగం బారిన పడి చిన్నారి మృతి

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం మెట్ట మార్గంలో వెళ్లుతున్న ఓ కుటుంబం బిడ్డను పోగొట్టుకుంది..నెల్లూరు జిల్లా పొతిరెడ్డిపాళెంకు చెందిన రెండు కుటుంబాలు (మొత్తం దాదాపు పిల్లలు పెద్దలు కలసి 10 మంది వరకు వుంటారు) శుక్రవారం కారులో తిరుపతికి చేరుకున్నారు..వీరు రాత్రి 8 గంటలకు అలిపిరి నుంచి మెట్లమార్గంలో కొండపైకి బయలుదేరారు..రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు..కుటుంబ సభ్యులు మాటాల్లో వుండగా పాప లక్షిత(6) కనిపించకుండా పోయింది..ఏటు వెళ్లింది ? ఏమైందని ? చుట్టు ప్రక్కల గాలించారు..కానీ ఎక్కడా పాప కనిపించలేదు.. పోలీస్ స్టేషన్ లో పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు..పోలీసులు మిస్సింగ్ కేసే నమోదు చేసి,,పాప కనిపించకుండా పోయిన ప్రాంతం ప్రక్కనే వున్న అడవిలో గాలింపు మొదలుపెట్టారు..శనివారం ఉదయం పాప కన్పించకుండా పోయిన ప్రాంతంకు దగ్గరలోనే,,పాప అడవి జంతువు దాడి చేసినట్లుగా భావిస్తున్న గుర్తులతో మృతుదేహం కన్పించింది.. మృతుదేహంను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.. .రుయా ఆసుపత్రి మార్చురీ వద్ద పాప మృతదేహాన్ని చూసిన తర్వాత డీఎఫ్ఓ మీడియాతో మాట్లాడారు. పాపపైన దాడిని చూసినప్పుడు చిరుత అయితే లోతైన గాయాలు అయ్యేవి అనిపిస్తోందన్నారు..ఎలుగుబంటి దాడి చేసిందా అన్న అనుమానం వుందని,, పోస్టుమార్టం రిపొర్డు వస్తే కాని ఏ విషయం చెప్పలేమన్నారు..భక్తులు నడక దారిలో గుంపులు గుంపులుగా వెళ్లడం శ్రేయస్కరమని చెప్పారు.( ఎవరు ఎన్ని చెప్పిన బిడ్డను పొగొట్టుకుని తల్లి,తండ్రుల ఆవేదన తీర్చలేనిది).
జూన్ 23న తిరుమల నడకదారిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది..కర్నూలు జిల్లా ఆదోని, హనుమాన్ నగర్ కు చెందిన శిరీష, కొండయ్యల కుటుంబ సమేతంగా జూన్ 23న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. నడకమార్గంలో కౌశిక్(5)తో వెళ్తుండగా ఏడో మైలురాయి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.. అమాంతం కౌశిక్ మెడ కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది..చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది..చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడ్డాడు..తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడు..శ్రీవారి దర్శనం అనంతరం వారు ఇంటికి వెళ్లారు.
2021 డిశంబరు 5వ తేది తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి చేసింది.. రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది..ఈ దాడిలో ఇద్దరు యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు..సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంబులెన్స్ లో ఇద్దరినీ తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు.. చిరుత రోడ్డు దాటే క్రమంలో ఇద్దరూ బైక్ పై రావటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావించారు.
          ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు హడవిడి చేస్తారే తప్ప? తరువాత ఏ విషయం పట్టించుకోరని భక్తులు కోపం,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరి అధికారులు ఏవైన జాగ్రత్తలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *