AMARAVATHINATIONAL

దేశ సరిహద్దుల వద్ద మిగ్-29 స్క్వాడ్రన్ ల మోహరింపుతో మరింత భద్రత

అమరావతి: పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్న సరిహద్దు సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీనగర్ బేస్ను మరింత పటిష్టంగా చేశారు..ప్రస్తుతం ఈ బేస్ వద్ద మిగ్-29 యుద్ధ విమానాల(Mikoyan MiG-29)కు చెందిన స్క్వాడ్రన్ లను మోహరించారు..ఇప్పటి వరకు వున్న మిగ్-21 స్క్వాడ్రన్ ల స్థానంలో మిగ్-29 స్క్వాడ్రన్ లు పనిచేయానున్నాయి..ఈ స్క్వాడ్రన్ లను డిఫెండర్ ఆఫ్ నార్త్ గా పిలుస్తున్నారు..“శ్రీనగర్” కశ్మీర్ లోయ మధ్యలో ఉంటుంది..సరిహద్దుకు సమీపంలో మైదాన ప్రాంతల కంటే ఎత్తులో ఉన్న కశ్మీర్ లోయలోని వైమానిక స్థావరంలో దీర్ఘశ్రేణి క్షిపణులు,,మిగ్-29 స్క్వాడ్రన్ లను ఉంచడం మిలటరీ పరంగా వ్యూహాత్మకం..ఈ క్షిపణులతో శత్రువులను ఎదుర్కోగలమని భారత వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ వెల్లడించారు.. MiG-29లు MiG-21ల కంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ మిగ్ లు కాశ్మీర్ లోయలో తమ సేవాలను చాలా సంవత్సరాలు అందిస్తున్నాయి..2019వ సంవత్సరంలో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై General Dynamics F-16 Fighting Falconను త్రిప్పికొట్టగల్గిగాయి..వివాద సమయాల్లో శత్రు విమానాల సామర్థ్యాలను ఛేదించగల సామర్థ్యం కూడా ఈ యుద్ధ విమానాలకు ఉంది..అప్ గ్రేడ్ చేసిన MiG-29 విమానం నైట్ విజన్ గాగుల్స్ తో రాత్రిపూట పనిచేస్తుందని స్క్వాడ్రన్ లీడర్ పేర్కొన్నారు..2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి లడఖ్ సెక్టార్ లో MiG-29ను మోహరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *