AMARAVATHIINTERNATIONAL

భారతీయుల కోసం వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయి-ప్రధాని మోదీ

అమరావతి: భారత్,అమెరికాల మధ్య భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మకమైన సంబంధంగా నిలుస్తుందని,,భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు..గురువారం వైట్ హౌస్ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి అతిథ్యం ఇచ్చిన సందర్బంలో అమెరికా అధ్యక్షడు,,భారత ప్రధాన మంత్రి ప్రసంగించారు..తొలుత ప్రసంగించిన బైడెన్ మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ సహకారంతో క్వాడ్ బంధంను పటిష్టం చేశామన్నారు..ఇండో,ఫసిఫిక్ రీజన్ లో క్వాడ్ కీలకమని చెప్పారు.. పేదరికం నిర్మూలన విషయంలో భారత్,,అమెరికా కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు.. వైద్య సేవలు అందరూ అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు వాతావరణ మార్పు పై పోరాటం,,ఆహార అభద్రత తొలగించడం వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు..

తొలిసారి:- బైడెన్,జిల్ బైడెన్ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు..కోవిడ్ అనంతరం ప్రపంచం కొత్తరూపు సంతరించుకుంది మోడీ పేర్కొన్నారు..ప్రపంచంలో అన్ని దేశాలను బలోపేతం చేయడంలో భారత్,అమెరికాలు పనిచేస్తున్నయన్నారు..ప్రపంచ శాంతి సుస్థిరత శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు ముందుకు సాగుతాయన్నారు..30 సంవత్సరాల క్రిందట తాను అమెరికాకు వచ్చినప్పుడు ఒక సామాన్యుడిలా వైట్ హౌస్ ను బయట నుంచి చూసేనని,,ప్రస్తుతం భారత ప్రధానిగా వైట్ హౌస్ లో అడుగు పెట్టడడంతో అమెరికాలో నివాసిస్తున్న ప్రవాస భారతీయుల కోసం వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *