AMARAVATHI

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వలంటీర్లు,ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు-మీనా

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని,, ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు..బుధవారం CS జవహర్ రెడ్డి,,DGP రజేంద్రనాధ్ రెడ్డి,తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం,,నగదు అక్రమ రవాణను అడ్డుకుని,,వాటిని సీజ్ చేశామని తెలిపారు..గడిచిన మూడు రోజుల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వలంటీర్లు,,ప్రభుత్వ ఉద్యోగులు,, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు.. ఏదైనా రాజకీయ పార్టీకి ఉద్యోగులు స్వయంగా ప్రచారం చేస్తే, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు..సువిధ యాప్ ద్వారా సభలు,, ప్రచారానికి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.. DSCపై తాము విద్యాశాఖ వివరణ కోరామని,,సదరు శాఖ నుంచి వివరణ రాగానే DSC నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని చెప్పారు..CEI నిర్ణయం ప్రకారం.. DSC వాయిదా వేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అంశాలను సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.. ఇప్పటివరకూ ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షలు,, అలాగే ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగులను తొలగించామన్నారు..ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం అంశంపై కూడా ముఖేష్ కుమార్ మీనా స్పందించారు.. ఈ అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసిన అయన తన దృష్టికి వచ్చిన ఫిర్యాదును హోంశాఖ కార్యదర్శికి పంపానని,,ఆయన దర్యాప్తునకు ఆదేశించారని తెలిపారు..మూడు జిల్లాల ఎస్పీలకు ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు వచ్చిందన్నారు..ప్రకాశం,,నంద్యాల,, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస జరిగిందన్నారు..ఆళ్లగడ్డ, గిద్దలూరులో హత్యలు జరిగాయని,, మాచర్లలో కారు తగులబెట్టారని తెలిపారు..ఈ విషయాలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరామన్నారు..గురువారం సాయంత్రం 4 గంటలకు ఈసీ కార్యాలయంలో సీఈవో వద్ద హాజరై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించామన్నారు.. హత్యలు, హింస ఎలా జరిగాయో,, ఎవరి పాత్ర ఉందనే విషయంపై వివరణ తీసుకుంటామన్నారు.. ఇలాంటి హింసకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు..

‘ఉస్తాద్ భగత్‌సింగ్’:- జనసేన  అధిపతి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి రీసెంట్‌గా భగత్స్ బ్లేజ్ పేరిట ఒక టీజర్ వచ్చిన విషయం విదితమే..ఈ టీజర్‌లో పవన్ గాజు గ్లాసుపై చెప్పిన డైలాగ్ మాత్రం పెద్ద దుమారం రేపింది.. ఇది పొలిటికల్ ప్రచారం తరహాలో ఉందంటూ కొన్ని వర్గాలవారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు..దీనిపై ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ,, తాను ఈ టీజర్ చూడలేదని స్పష్టం చేశారు..ఒకవేళ ఈ టీజర్ పొలికల్ ప్రచారం తరహాలో ఉంటే,, అప్పుడు తప్పకుండా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు..ఆ టీజర్ చూస్తే కానీ ఏ విషయం స్పష్టంగా చెప్పలేనని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *