జపాన్ లో నివాసిస్తున్నఅలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా

అమరావతి: చైనాకు చెందిన బిలియనీయర్,ఈ కామర్స్ దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గత కొంత కాలంగా ఎక్కడ కనిపించడం లేదు. ఆయన చైనాను వీడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో జాక్‌మా గత ఆరు నెలలుగా జపాన్ దేశంలో నివసిస్తున్నారని, లో ప్రొఫైల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు కొన్ని న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం జాక్‌మా తన కుటుంబంతో కలిసి టోక్యో వెలుపల హాట్ స్ప్రింగ్ అండ్ స్కీరిసార్ట్ లో నివసిస్తున్నట్లు ఓ ఏజెన్సీ వెల్లడించింది.తరుచు ఆయన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020లో అక్టోబర్‌లో షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో జాక్‌మా చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలు,, చైనా రెగ్యులేటర్‌పై విధానలపై విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలతో చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ మండిపడింది.ఆ తర్వాత జాక్‌మా నేతృత్వంలోని కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. జిన్‌పింగ్ ఆదేశాల మేరకు చైనా అధికారులు నవంబర్ లో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ల డాలర్ల ఐపీఓను అధికారులు నిలిపివేయడంతో పాటు కంపెనీపై ప్రభుత్వం బిలియనర్ల డాలర్ల జరిమానా విధించింది.అనంతరం చాలాకాలం పాటు కనిపించలేదు.