అమరావతి: జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీని అధిష్టానం బుధవారం ప్రకటించారు.. గులాం నబీ ఆజాద్ను సదరు కమిటీకి చెర్మన్గా నియమించారు..అయితే కమిటీని ప్రకటించిన కొంత సేపటికే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు..అజాద్ రాజీనామా చేసిన కొద్ది సమయానికే మరో ముగ్గురు కశ్మీర్ నేతలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీకి రాజీనామా చేశారు..ఇందులో ఒకరు సోపోర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హజి అబ్దుల్ రషిద్,,మహ్మద్ భట్,,గుల్జర్ అహ్మద్ వనిలు వున్నారు..ఇంత తక్కువ వ్యవధిలో నలుగురు కీలక నేతలు పార్టీ వీడడంతో ఇప్పటికే కశ్మీర్లో అంతంతగానే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది కొలుకోలేని పెద్ద ఎదురు దెబ్బ అని రాజకీయ పరిశీలకు వ్యాఖ్యనిస్తున్నారు..