AMARAVATHIPOLITICS

టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వస్తుంది! – జనసేనాని

అమరావతి: టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందని తాను భావిస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు..శుక్రవారం మంగళగిరి కార్యాలయంలో అయన మాట్లాడుతూ తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటాం ? ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం ? అనేది వైసీపీకి ఎందుకని నిలదీశారు..2014లో టీడీపీ,,జనసేన,,బీజెపీ కలసి పోటీ చేసిందని,అదే కూటమి మళ్లీ 2024లో కలిసి ఎన్నికలకు వెళ్లాలని తను బలంగా కోరుకుంటున్నాను అని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, కూటములు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఒక వైపు చర్చలు జరుగుతుండగా,, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు..
టీడీపీతో పొత్తు విషయమై తాను ఢిల్లీకి వెళ్లి ప్రకటించాలి అనుకున్నానని అయితే వైసీపీ నాయకులు ప్రవర్తించిన విధానం వల్లే రాజమండ్రిలో పోత్తూలపై ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు..ఆదే సమయంలో G-20 సమావేశాల వల్ల బీజేపీ అగ్రనేతలు అందుబాటులో లేరని తెలిపారు..జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ ఇప్పటికే ఉందని,, టీడీపీతో పొత్తూ విషయం ప్రకటించడంతో,ఇప్పుడు టీడీపీ-జనసేన కో-ఆర్డినేషన్ కమిటీని నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు..తెలంగాణలో టీడీపీతో పొత్తు గురించి చర్చలు జరగాలన్నారు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కో-ఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. తెలంగాణకు పసుపు బోర్డు వచ్చిందని,, జగన్ డిల్లీకి వెళ్లి కోకోనట్ (కొబ్బరి) బోర్డు తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు..జగన్ డిల్లీకి వెళ్లేది తన కేసుల గురించి కానీ రాష్ట్రం గురించి కాదంటూ దెప్పిపొడిచారు..కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం లాబియింగ్ రాష్ట్రం కోసం చేస్తుందా? లేక జగన్ వ్యక్తిగత విషయాల కోసం కేంద్రంతో, వైసీపీ ప్రభుత్వం లాబియింగ్ చేస్తోందా అంటూ ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *