బీజెపీ కండువా కప్పుకున్నమర్రి.శశిధర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం నేర్పించడం బీజేపీకే సాధ్యమవుతుందని మాజీ కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మర్రి.శశిధర్ రెడ్డి వ్యాఖ్యనించారు.శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు.ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు హాజరయ్యారు.ఈ సందర్బంలో శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు మంచి ప్రభుత్వంను కోరుకున్నరని,ఇందుకు విరుద్దంగా ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్,టీ.ఆర్.ఎస్ ను నిలదీయడంలో విఫలం అయ్యిందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో ముందుకు వెళుతోందని, తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానని తెలిపారు. బీజేపీ బలోపేతానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమే అని చెప్పారు.