AMARAVATHICRIMEPOLITICS

తమిళనాడు బీజెపీ అధ్యక్షడు అన్నామలైపై కేసులు నమోదు చేసిన పోలీసులు

అమరావతి: బీహార్ వలస కార్మికులపై దాడి వివాదం తమిళనాడు రాజకీయల్లో వేడిపుట్టిస్తొంది..ఉద్దేశపూర్వకంగానే కొంత మంది తప్పుడు ప్రచారం సాగిస్తూ,, నకిలీ వీడియోలు పోస్ట్ చేశారని తమిళనాడు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు..విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైపై ఆదివారంనాడు కేసు నమోదు చేశారు..అన్నామలైపై CCB సైబర్ క్రైమ్ డివిజన్ కేసు నమోదు చేసినట్టు చెన్నై పోలీసులు చెప్పారు..IPC Sec 153, 153ఏ(1), 505(1)(b), 505(1)(c) కింద ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు..అలాగే బీజేపీ బీహార్’ ట్విట్టర్ అకౌంట్ హోల్డర్‌పై కూడా ఇవే సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు..

నేను సిద్దం అరెస్టు చేయండి… తనపై FIR నమోదు చేయడంపై అన్నామలై మండిపడ్డారు.. స్టాలిన్ ప్రభుత్వానికి 24 గంటలు సమయమిస్తున్నానని,, తనను అరెస్టు చేసుకోవచ్చన్నారు.. ”ఉత్తరాది సోదరులపై 7 దశాబ్దాలుగా వారు చేస్తున్న ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకే నాపై DMK ప్రభుత్వం కేసు పెట్టిందని,,నేను అర్ధం చేసుకోగలను.. వారు ఏమి మాట్లాడారో ఆ వీడియోను మీ ముందు వుంచుతున్నాను..దానినే నేను నా ప్రెస్‌మీట్‌లో చెప్పాను..తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతు నులమాలని DMK నాయకులు అనుకుంటున్నారు..ఒక సాధారణ వ్యక్తిగా మీకు నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను…మీకు సాధ్యమైతే నా చేతులకు సంకెళ్లు వేయండి..నన్ను అరెస్టు చేయాలని ఫాసిస్ట్ DMKను సవాలు చేస్తున్నా” అని అన్నామలై తన ట్వీట్టర్ లో పోస్టు చేశారు..సదరు ట్వీట్‌కు ఒక వీడియోను కూడా జత చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *