స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధతపై కేంద్రానికి సుప్రీమ్ నోటీసులు

అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ పిటిషన్పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరి పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు LGBTQ+ పౌరులకు కూడా వర్తిస్తుందని, స్వలింగ సంపర్కులైన సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రియో చక్రవర్తి , అభయ్ డాంగ్లు కలిసి 10 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గత సంవత్సరం (2021) డిసెంబరు నెలలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు , స్నేహితుల సమక్షంలో 9వ వార్షికోత్సవం జరుపుకున్నారు. LGBTQ+ కమ్యూనిటీ సభ్యులు తమకు నచ్చిన వ్యక్తిని విహహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కులను అమలు చేయాలని సుప్రీం కోర్టును కోరారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.LGBTQ+ కమ్యూనిటీ సభ్యులు ఇతర పౌరులతో పాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు.ఈ జంట తరపున న్యాయవాదులు అరుంధతీ కట్టూ, తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.