AMARAVATHIDISTRICTSPOLITICS

నెల్లూరుజిల్లా రాజకీయలు అంటే ఇలాగే వుంటాయి-అవసరంకు అనుగుణంగా ?

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరుజిల్లా రాజకీయలకు ఒక ప్రత్యేక స్థానం వుంది..జిల్లాలో రాజకీయ చైతన్యం పాళ్లు కాస్త ఎక్కువే అన్న గుర్తింపు ??.. (ఉరంతా ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి) అన్న చందనా  ఎన్నికల్లో  రాష్ట్ర ప్రజలది అంతా ఒక దారి అయితే జిల్లా ప్రజలది మరో దారి..ఇందుకు ఉదహరణ 2014,,2019 ఎన్నికలే…2014 ఎన్నికల్లో టీడీపీ,బీజెపీ,పవన్ కళ్యాణ్ కలసి ఎన్నికల ప్రచారం చేస్తే,,మిగిలిన జిల్లాల మాట ఎలా వున్న,, నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీకే మెజార్టీ ప్రజలు పట్టం కట్టారు..అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీని జిల్లా నుంచి పూర్తిగా తుడిపెట్టేశారు..ఈ కథ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే…గత 6 నెలలుగా జిల్లాలో రాజకీయ అవసరాల కోసం వైసీపీ తరపున ఎమ్మేల్యేగా గెలిచిన నాయకులకు 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత,సి.ఎం జగన్ ఎమ్మేల్యేగా పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తారో ? లేదో ? అన్న శంకం పట్టుకుంది…అప్పటి నుంచి ప్రతిపక్షపార్టీ అధినేత చంద్రబాబుకు సదరు ఎమ్మేల్యేలు “ టచ్ “లోకి వెళ్లడం జరిగిందని అధికారపార్టీ నాయకులు మండిపడ్డారు…లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్న ఎమ్మేల్యేలపై పరోక్ష చర్యలు అధికారపార్టీ చర్యలు తీసుకొవడం ప్రారంభించింది… ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎమ్మేల్యేలు, మీడియా ముందుకు వచ్చి తమ నియోజకవర్గంలో అభివృద్ది అగిపోయిందని,,ఈ విషయంపై ప్రశ్నిస్తే తమను అవమానించారంటూ నానా యాగీ చేశారు…రాజకీయ అవసరాల కోసం ముందుగానే సిద్దం చేసుకున్న వేదికపైకి శనివారం టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేశారు…తమ పార్టీలోకి రావలంటూ ఆహ్వనాలు పలికారు…ఇదే సమయంలో టీడీపీ నాయకుడు లోకేష్ పాదయాత్ర(యువగళం) ఈ నెల 13వ తేదిన జిల్లాలోకి ప్రవేశిస్తుండడంతో,,దిన్ని అవకాశంగా మలుచుకుని,, వారి నియోజకవర్గాల్లో ప్రజలకు టీడీపీ టోపీలను పెట్టేందుకు ముదిరిపోయిన మన జిల్లా ఎమ్మేల్యేలు ముందుకు అడుగులు వేస్తున్నారు…రాబోయే రోజుల్లో జిల్లా ప్రజలు ఎన్ని రకాల “ రాజకీయ నాటికలు రంగస్థలం (నియోజకవర్గం)పై చూడాల్సి ఉందో “ ??

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *