అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో గురువారం మధ్యహ్నం పడవ బోల్తా పడిన సంఘటనలో 30 మందికిపైగా గల్లంతయ్యారు.. వీరిలో 20మంది మృతి చెందారు..ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 60 మంది ప్రయాణీకులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ భవానిసింగ్ తెలిపారు..బందాలోని మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తున్న బోటు అదుపు తప్పి బోల్తాపడింది..గల్లైంతన వారిలో 20 నుంచి 25 మంది వరకు చిన్నారులు, మహిళలు ఉన్నట్లుగా సమాచారం..గల్లైంతన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. పడవలో ఉన్నవాంతా నీటిలో మునిగిపోయారు..ఈత వచ్చినవారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు..మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.