CRIMENATIONAL

పశ్చిమబెంగాల్,పశువుల అక్రమ రవాణా కేసులో TMC నేతను అరెస్ట్ చేసిన సిబిఐ

అమరావతి: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అత్యంత సన్నిహితుడైన అనుబ్రతా మండల్‌(61)ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది..2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా మండల్‌ను అరెస్టు చేసింది.. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ కేసులో మండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు జారీ చేసింది..గత కొంతకాలంగా హైపోక్సియా(ఆక్సిజన్‌ కొరత) రుగ్మతతో బాధపడుతున్న అనుబ్రతా మండల్‌ ఎక్కడకు వెళ్లినా ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళ్తుంటారు..ప్రస్తుతం ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉందని,, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని SSKM ఆసుపత్రి డాక్టర్లు తెలపడంతో, మండల్‌ ను సీబీఐ అరెస్ట్‌ చేసింది.. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం అనుబ్రతా మండల్‌ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు దాదాపు గంటన్నరకు పైగా ప్రశ్నించారు..విచారణకు ఆయన సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మండల్‌ టీఎంసీ జాతీయ వర్కింగ్‌ కమిటీలోనూ చోటు సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న అనుబ్రతా మండల్‌ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు..తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా బాగా గుర్తింపు పొందారు..  పశువుల అక్రమ రవాణా కేసులో 2020లో సీబీఐ కేసు నమోదు చేయడంతో మండల్ పేరు వెలుగులోకి వచ్చింది..ఈ కేసుకు సంబంధించి జిల్లాలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే సోదాలు నిర్వహించి,మండల్‌ అంగరక్షకుడిని అరెస్టు చేసింది..మండల్ చాలా సందర్భాల్లో రెచ్చగొట్టే ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకున్నారు.. ఒక సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలంటూ టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు.. చాలా మంది రౌడీషీటర్లకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ జిల్లాలో ఇసుక, రాళ్ల తవ్వకాలతో పాటు పశువుల అక్రమ రవాణాలోనూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుబ్రతా మండల్‌పై ఆరోపణలు ఉన్నాయి.. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *