AMARAVATHIHEALTH

సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు-వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి

తిరుపతి: మహిళలకు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా అదునిక సౌకర్యాల వున్న రూ.3 కోట్లు విలువ చేసే మొబైల్ బస్సులో నిర్వహిస్తారని, ఈ ఆవకాశంను ప్రజలు ఉపయోగించుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి.ప్రశాంతి కోరారు..ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే 2024 సందర్బంగా ఆదివారం శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆవరణలో రెండు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే బస్ లను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు..ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ శ్రీపద్మావతి మహిళా మెడికల్ కాలేజీకి రెండు అత్యాధునిక పరికరాలు గల మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బస్సులను దాతలు విరాళంగా ఇచ్చిన వాటిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. ప్రజలు ఈ వాహనాలు వారి గ్రామాలకు వచ్చినప్పుడు క్యాన్సర్ అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు..రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సహకారంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..ఈ వాహనంలో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని, ఊపిరితిత్తులకు, ఇతర సంబంధ క్యాన్సర్ అనుమానితులను స్విమ్స్ హాస్పిటల్ కు రెఫెర్ చేయబడుతుంది అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, జేఈఓ సదాభార్గవి, టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, స్విమ్స్ డైరెక్టర్ మరియు వి.సి ఆర్ వి కుమార్, స్పెషల్ ఆఫీసర్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి జయచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *