AMARAVATHI

ఇసుక అక్రమాలపై చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సిఐడి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై, సీఐడీ తాజాగా మరో కేసును నమోదు చేసింది..2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక అక్రమాలపై AP MDC ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది.. ఈ కేసులో A1 గా పీతల సుజాత, A2 గా చంద్రబాబు, A3 గా చింతమనేని ప్రభాకర్,A4 గా దేవినేని ఉమ పేర్లను సీఐడీ చేర్చింది..టీడీపీ అధికారంలో వున్న సమయలో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చేలా వీరంతా వ్యవహరించారనే ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.. ఉచిత ఇసుక ముసుగులో మొత్తం రూ. 10వేల కోట్ల దోపిడీ చేశారని,,దిని కారణంగా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు..చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు..ఈ నలుగురితో పాటు మరికొందరిపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది..

MRO వనజాక్షి:- ఇసుక ఆక్రమ తవ్వకాలకు అడ్డుపడిన ఓ మహిళ MROపై అప్పటి ఎమ్మేల్యే చింతమనేని.ప్రభాకర్,,సదరు MRO వనజాక్షిని జుట్టుపట్టుకు ఈడ్చి వేశాడు..అప్పట్లొ ఈ విషయం సంచలనంగా మారింది..ఈ సంఘటనపై ప్రభుత్వం చింతమనేనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *