AMARAVATHI

రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయి వుంటే క్రిమినల్ చర్యలు-రాజీవ్ కుమార్

అమరావతి: ఒక వ్యక్తి (అమె లేక అతడు) రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయి వుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ హెచ్చరించారు.. 2024 సార్వత్రిక (పార్లమెంట్, అసెంబ్లీ) ఎన్నికలకు సంబంధించిన తొలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై (రాజకీయపార్టీలు,,అధికారులు) అందరితో సమావేశాలు నిర్వహించామన్నారు..రాబోయే ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకొవడం జరుగుతుందన్నారు..రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని,, ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పులు విషయంలో చర్యలు తీసుకోవాలని సదరు పార్టీలు కోరాయని తెలిపారు..ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని,, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు మంది ఉన్నారని చెప్పారు..SSR విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చని సూచించారు.. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *