బాలీవుడ్ నటి ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అమరావతి: బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్‌కు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు.2023 సంవత్సరానికి ఈ అవార్డు అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు.ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను సెప్టెంబర్ 30న నిర్వహించనున్నారు. సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డు సైతం అందజేసింది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్, ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖాన్నా,దేవికారాణి,రజనీకాంత్ లు అందుకున్నారు.
Dada Saheb Phalke Award to be conferred to actor Asha Parekh this year: Union Minister Anurag Thakur pic.twitter.com/gP488Ol4zH
— ANI (@ANI) September 27, 2022