AMARAVATHITECHNOLOGY

ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు,ఇతరత్రలు దిగుమతిపై నిషేధం విధించిన డీజీఎఫ్టీ

అమరావతి: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ లు, వ్యక్తిగత కంప్యూటర్ ల దిగుమతిపై తక్షణ నిషేధాన్ని విధిస్తూ భారత ప్రభుత్వం గురువారం నోటీసు జారీ చేసింది.. Directorate General of Foreign Trade (DGFT) ఈనోటీసులను జారీ చేసింది..పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇ-కామర్స్ పోర్టల్ ల నుంచి కొనుగోలు చేసిన కంప్యూటర్ లతో సహా all-in-one పర్సనల్ కంప్యూటర్ లు లేదా అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ లు దిగుమతి అవుతున్నాయని పేర్కొంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో బాగంగా పరిశ్రమలకు ఉతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..దేశంలో తమ యూనిట్లను నిరంతరం ఉత్పత్తి చేస్తూ,,దేశీయంగా సరఫరా చేస్తూ, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశీయ తయారీదారులు, స్వదేశంలో తయారు చేస్తున్న విదేశీ కంపెనీలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.. ప్రస్తుతం, భారతదేశం అతిపెద్ద వాణిజ్య లోటు చైనా, అమెరికాతో ఉంది.. చైనాను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *