AMARAVATHICRIME

రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ మాఫీయా కేసులో DMK నేత,సినీ నిర్మాత AR జాఫర్‌ సాదిక్‌ అరెస్ట్

అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్ మాఫీయాకు సబంధించి దాదాపు రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన DMK NRI విభాగం నాయకుడు,,సినీ నిర్మాత AR జాఫర్‌ సాదిక్‌ ను శనివారం అరెస్ట్‌ చేసినట్లు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు..గత నెలలో ఢిల్లీ పోలీసులు,,NCB అధికారులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ ను ఫిబ్రవరి 24న గుర్తించారు..ఈ కేసులో ఇప్పటికే అధికారులు కొందరిని అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా వారి వద్ద నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు..ఈ డ్రగ్స్ రాకెట్ లో జాఫర్‌ సాదిక్‌ కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం వేల మొదలు పెట్టారు..శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు.

ఈ డ్రగ్‌ నెట్‌వర్క్ భారతదేశం,,న్యూజిలాండ్,,ఆస్ట్రేలియా,, మలేషియాలకు విస్తరించినట్లు NCB అధికారులు తెలిపారు..హెల్త్ మిక్స్ పౌడర్,, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కంటైర్స్ సరకుల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు..గత 3 సంవత్సరా వ్యవధిలో మొత్తం 45 సరకులు పంపారని,, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ రవాణా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు..డ్రగ్స్ మాఫీయా నెట్‌వర్క్‌ లో వున్న నిందితులను అరెస్టు చేసేందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా అధికారులను సంప్రదించినట్లు NCB అధికారులు తెలిపారు.
జాఫర్‌ను పార్టీ నుంచి తొలగించిన DMK:- జాఫర్‌ సాదిక్‌ తమిళనాడులోని DMK పార్టీలో కీలకమైన వ్యక్తి..భారీ డ్రగ్‌ రాకెట్‌లో ఆయన పాత్ర బయట పడడంతో డీఎంకే సాదిక్‌పై ఇటీవలే చర్యలు తీసుకుంది..పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ప్రకటించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *