హైదరాబాద్: లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మిలను గురువారం ఉదయం నుంచి విచారించారు. హైదరాబాద్ కు వచ్చిన వీరిద్దరూ ఈడీ ముందు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు పూరి, ఛార్మిని ఈడీ ప్రశ్నించింది. లైగర్ సినిమా నిర్మాణానికి విదేశీ అకౌంట్స్ నుంచి వీరి ఇద్దరి ఖాతాల్లోకి ట్రాన్సక్షన్స్ జరిగినట్లు గుర్తించారు.20 రోజుల క్రితమే పూరి జగన్నాథ్, ఛార్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన వీరిద్దరిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.