నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

నెల్లూరు: అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో శుక్రవారం వేకువజామున 2.45 గంటలకు మంటలు చెలరేగాయి.ఈ సమయానికి ట్రైయిన్ గూడూరు జంక్షన్ వద్దకు చేరుకుంది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైయిన్ లోని ప్యాం ట్రీకార్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికార ప్రతినిధి నుస్రత్ ఎం మంద్రుప్‌కర్ తెలిపారు.రైలు గూడూరు వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగడంతో కిటికీల ద్వారా పొగ బయటికి వచ్చే సమయంలో ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని, ఆ తర్నాత సప్లై ఆపేసి మంటలను అదుపులోకి తెచ్చామని,వెంటనే స్టేషన్ సిబ్బంది ఆప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.రైలు చెన్నైకు వెళ్లిందన్నారు.అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే విషయమై దర్యాప్తు చేస్తుమన్నారు.