DISTRICTS

GGHలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని మౌలిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,  వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో  GGH అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా GGHని అభివృద్ధి చేయాలన్నారు.ఆసుపత్రి అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. GGHలో కానుపుల సంఖ్య,  స్కానింగ్, సర్జరీలను ఇంప్రూవ్ చేయడంతో పాటు రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.ఆసుపత్రి పరిధిలో అందించే వైద్య సేవలన్నింటీని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఆసుపత్రిలో ఎక్యూప్మెంట్ కు చేపట్టాల్సిన మరమ్మత్తులకు సంబంధించి మంజూరు చేసిన పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఖాళీగా వున్న డాక్టర్, సిబ్బంది పోస్టులను త్వరగా భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలనన్నారు. ఈ సమావేశంలో GGH సూపరింటెండెంట్‌ డా.శిద్దా నాయక్,  APMSIDC EE విజయభాస్కర్, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కో ఆర్డినేటర్ శ్రీమతి సునంద, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సభ్యులు అభిషేక్ రెడ్డి, వెంకటేశ్వర్లు, GGHకు సంబంధించిన వివిధ విభాగాల H.O.Dలు,  వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *