AMARAVATHINATIONAL

రైతులు ఇకపై ఎర్రచందనం సాగు, ఎగుమతి చేసుకోవచ్చు-కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

నెల్లూరు: ఎర్రచందనం మొక్కలను పెంచిన తరువాత దుంగలను ఎగుమతి చేసేందుకు ఇప్పటి వరకు వున్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు..సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష విబాగం నుంచి ఎర్ర చందనం తొలగించినట్లు స్పష్టం వెల్లడించారు..ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora (CITES) 77వ కన్వెన్షన్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..2004 నుంచి భారత్ లో లభ్యమయ్యే ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు, ఎగుమతులపై నిషేధం విధించామన్నారు..సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియనుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *