విజయవాడ బాణసంచా దుకాణాల సముదాయంలో అగ్నిప్రమాదం-ఇద్దరు మృతి

అమరావతి: విజయవాడ,గాంధీనగర్ ప్రాంతంలోని జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణాల సముదాయంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బ్రహ్మ,కాశీ అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.. భారీ అగ్నిప్రమాదంతో గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన 15 దుకాణాలకు మంటలు వ్యాపించాయి.ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.షాపులకు మంటలు వ్యాపించడంతో, దుకాణంలోని బాంబుల మోతకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.కొన్ని దుకాణాలు పూర్తిగా,, మరికొన్ని పాక్షికంగా అగ్నికీ అహుతి అయ్యాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్లే జరిగిందని,అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.