NATIONALTECHNOLOGY

రక్షణ పరికరాల దిగుమతుల నుంచి 75 దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి-ప్రధాని మోదీ

Aero India Show 14వ ఎడిషన్‌..

అమరావతి: భారతదేశంలో ఆత్మనిర్భర్ లో బాగంగా విదేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని,,రక్షణ రంగంలో భారత్ బలమైన శక్తిగా అవతరించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం 2023 Aero India Show 14వ ఎడిషన్‌ను ప్రధాని ప్రారంభించారు..కర్ణాటలకలోని యలహంక ఎయిర్ బేస్‌లో 5 రోజుల పాటు (ఈ నెల 17వ తేది వరకు) జరిగే ఏరో ఇండియా షోను ప్రారంభించిన సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ Aero India Show ప్రదర్శన భారత్ కు నూతన ఉత్సహాం ఇస్తుందని,,అలాగే మన శక్తి సమార్దాలను ప్రతిబింబిస్తుందన్నారు.. కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగం వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్ద పీట వేశామన్నారు..పరిశ్రమలకు ఇచ్చే అనుమతులన సరళతరం చేశామని,,తక్కవు ఖర్చుతో రక్షణ పరికరాలు మనమే తయారు చేసుకుంటున్నామన్నారు.. దశాబద్దాల పాటు ప్రపంచంలో అతిపెద్ద రక్షణ పరికరాల దిగుమతిదారుగా వున్న ఇండియా నేడు ప్రపంచంలోని 75 దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి చేస్తొందని వెల్లడించారు..రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రేవేట్ సంస్థలను కోరుతున్నాను అని అన్నారు..నేడు జరుగుతున్న Aero India Showలో 100 దేశాలను పాల్గొంటున్నాయి అంటే భారత్ పై ప్రపంచ దేశాలకు ఏ మేరకు విశ్వాసం పెరిగిందొ అనేది స్పష్టం అవుతుందన్నరు…ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,,సీఎం బసవరాజ్ బొమ్మై,,గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్,, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.. ప్రధాన మంత్రి ఎయిర్ షోను ప్రారంభించగానే, సారంగ్ హెలికాప్టర్ల వంటి యుద్ధ విమానాలు అకాశంలో కనువిందు చేశాయి..

వైమానిక ప్రదర్శనలో 98 దేశాలు పాల్గొంటున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెళ్లడించారు..ఏరో ఇండియా షోలో కేవలం ఎయిర్ పవర్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 809 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయన్నారు..వేడుకల్లో 32 దేశాల రక్షణ మంత్రులు పాల్గొననున్నారు..ఈ కార్యక్రమానికి 29 దేశాల వైమానిక దళాధిపతులు హాజరుకానున్నారు..రక్షణ రంగంలోని గ్లోబల్‌ కంపెనీల సీఈవోల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది..ఈ సమావేశానికి మొత్తం 73 మంది సీఈవోలు హాజరు కానున్నారు..బోయింగ్ , లాక్హీడ్ మార్టిన్ , ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, జనరల్ అటామిక్స్ , లైబర్ గ్రూప్, రేథియాన్ టెక్నాలజీస్, సఫ్రాన్, జనరల్ అథారిటీ ఆఫ్ మిలిటరీ ఇండస్ట్రీస్ వంటి గ్లోబల్ కంపెనీలు పాల్గొంటున్నాయి..HAL, BEL, BDL, బెమెల్, మిశ్రా ధాతు నిగమ్ వంటి భారత రక్షణ రంగ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి..ఈ సంవత్సరం ఏరో ఇండియా షోలో 251 ఒప్పందాలు (MOU) కుదుర్చుకునే అవకాశం ఉంది..ఇది నెరవేరితే భారత ఆర్థిక వ్యవస్థకు 75 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి..హెచ్‌ఏఎల్‌కు అనేక కాంట్రాక్టులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *