AMARAVATHINATIONAL

హైందవేతరులను బుజ్జగించే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తొంది-రవి శంకర్ ప్రసాద్

అమరావతి: సనాతనం ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా, ఎయిడ్స్, కుష్టు రోగం వంటిదని, భావప్రకటన స్వేఛ్చ వుంది కదా అని,రాజ్యంగ బద్దమైన పదవుల్లో వున్నవాళ్లు సైతం కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై మాజీ కేంద్ర మంత్రి,,బీజెపీ నేత రవిశంకరప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..గురువారం అయన మీడియా సామావేశంలో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు డీఎంకే నేతలు వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు..హైందవేతరులను బుజ్జగించే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తొందని ధ్వజమెత్తారు..భారత రాజ్యాంగం వ్రాత ప్రతిలో హిందూ దేవతల బొమ్మలు ఉన్నాయని చూపించారు..శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు చిత్రాలు దీనిలో ఉన్నాయని తెలిపారు..ఇందులో మొఘల్ పాలకులు ఔరంగజేబు, బాబర్ వంటివారి చిత్రాలు లేవని, భారత దేశానికి చెందిన రాణీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద వంటివారి చిత్రాలు ఉన్నాయని చెప్పారు..ఈ విషయాన్ని గమనించాలని సోనియా గాంధీని కోరారు..దీని చివర్లో మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంతకాలు చేశారన్నారని తెలిపారు..భారతదేశ రాజ్యాంగంలోని చాలా పేజీల్లో హిందూ దేవుళ్ల ఫొటోలు ఉన్నాయని, భారత దేశం అత్యంత సంపన్నమైదని, గొప్ప సంస్కృతితో అలరారిందని చెప్పడం కోసం ఈ చిత్రాలను ముద్రించారన్నారు.. ప్రాథమిక హక్కులను రాసిన పేజీ పైన శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు కలిసి లంక నుంచి విజేతలుగా తిరిగి వస్తున్నట్లు కనిపిస్తున్న చిత్రాన్ని ముద్రించారని వెల్లడించారు..ఆదేశిక సూత్రాలను రాసిన పేజీలో, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ముద్రించారని,,హనుమంతుడు, నటరాజుస్వామి చిత్రాలు కూడా వేర్వేరు పేజీల్లో ఉన్నాయన్నారు.మరి దిన్ని ఏవిధంగ నిర్మూలిస్తారని ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *