అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి,,మహిళతో శృంగారంలో పాల్గొంటే ఆ సదరు చర్యను రేప్‌గా పరిగణించలేమని వ్యాఖ్యానించలేమని ఒడిశా హైకోర్టు జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పు వెలువరించింది..ఒడిశాలోని నిమపాదకు చెందిన ఒక మహిళను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి,,అతడు ఆమెను తీసుకుని, భువనేశ్వర్ వెళ్లాడు..ఇద్దరూ కొంతకాలంపాటు అక్కడే కలిసే ఉన్నారు..తనను పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పడంతో, ఆమె అతడితో శృంగారంలో పాల్గొంది..కొద్ది రోజుల తరువాత అతడు,ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు..దీంతో అతడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకున్నాడని, తర్వాత పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయాడని, అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని కోరింది..అమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు..ఈ అరెస్టును సవాలు చేస్తూ నిందితుడు,ఒడిశా హైకోర్టును ఆశ్రయించాడు..దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది..‘‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం..అది పరస్పర అంగీకారంతో జరిగింది కాబట్టి, రేప్‌గా భావించలేం’’ అని చెబుతూ నిందితుడికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది.