నెల్లూరు: స్టేజ్ పైన రూ.100 కోట్ల ఆస్తి వున్న వ్యక్తులు వున్నారు..నా స్థాయి చాలదు అని భావించారో ఏమో.. అందుకే నన్ను పిలవలేదు…సమయం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చివేస్తా అంటూ నర్మగర్భంగా నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్,,ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో పేదలకు సంక్రాంతి కానుకలను అందచేసిన కార్యక్రమం గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు.సోమవారం 48వ డివిజన్ పరిధిలో అయన పర్యాటించిన సందర్బంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.