ప్రజాప్రతినిధులు మీద కేసులు ఎలా ఉపసంహరించుకుంటారు-హైకోర్టు

మొట్టికాయలు..
అమరావతి: హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి.. ప్రజాప్రతినిదులపై కేసు ఉపసంహరణకు సంబంధించి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.దాదాపు 32 మంది ప్రజాప్రతినిధులు మీద కేసులు ఉపసంహరించారంటూ హైకోర్టులో జర్నలిస్ట్ ఫోరమ్ అద్యక్షులు కృష్ణజనేయులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని గతంలో ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరుపున ప్రమాణ పత్రం దాఖలు చేయమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో, తప్పని పరిస్థితులలో ప్రభుత్వం మొత్తం జీవోలను ఉపసంహరించుకుంది. ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మూసివేసింది.