AMARAVATHI

రాబోయే అగష్టు 15వ తేదిన మళ్లీ ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురువేస్తాను-ప్రధాని మోదీ

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తివర్ణ పతాకాన్నిఆవిష్కరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకానికి వందనం చేశారు.. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం చేశారు..మంగళవారం దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ 140 కోట్ల భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని,,బాపూజీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించామన్నారు..స్వాతంత్య్ర సమరంలో అసువులుబాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు పలుకుతున్నాని తెలిపారు..ప్రధాని జెండా అవిష్కరించిన అనంతరం ఐఏఎఫ్ హెలికాప్టర్ పూలవర్షం కురిపించారు.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలతో సహా పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు.. వేడుకల సందర్భంగా ఎర్రకోట బయట,లోపట ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేడయం ఇది 10వసారి..రాబోయే అగష్టు 15వ తేదిన మళ్లీ ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురువేస్తానని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *