AMARAVATHIPOLITICS

2024 ఎన్నికల్లో “జనసేన,,టీడీపీ కలసి అధికారంలోకి రావడం ఖాయం”-పవన్

అమరావతి: కురుక్షేత్ర యుద్దం మొదలైందని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నరని,,నేను సిద్దంగా వున్నాని,అయితే 150 మంది వైగా వున్నరు కాబట్టి మీరే కౌరవులు అని భావిస్తున్నాంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గంలో 4వ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించిన సందర్బంలో అయన మాట్లాడుతూ అధికారపార్టీ లాగా ఓట్లును కోనేందుకు తన దగ్గర డబ్బులు లేవని,,తనకు వున్నందల్లా ఈ నేలపైన,, యువకుల భవిష్యత్ పై ప్రేమ మాత్రమే అన్నారు.అధికారం మదం వున్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కొవాలో నాకు బాగా తెలుసుని,,అందుకే ఓట్లు చీలనివ్వకుండా వుండేందుకు రాజకీయ పొత్తులతో ముందుకు వెళ్లుతున్నమన్నారు.. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకు,,వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల్లో విధ్వసం సృష్టించదని,,ఒక వేళ పొరపాటున వైసీపీ మళ్లీ అధికారంలో వస్తే,,అటుపై యువతకు భవిష్యత్ అనేది లేకుండా పోతుందని చెప్పారు.. నిరుద్యోగులకు అండగా నిలుస్తానని,,వారికి ఉపాధి అవకాశలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..విద్యార్దులకు ఉన్నత చదువుంటూ,బైజ్యూస్ అనే సంస్ధను రంగంలోకి దించి,,విద్యార్దులను బత్తాయి జ్యూస్ లాగా పిండివేశారంటూ మండిపడ్డారు.. వైసీపీ ప్రభుత్వం చేయించిన సర్వేలో దాదాపు 65 వేల మంది పిల్లలు,,యువత మరణించారని,,ఇందుకు ఎవరు కారణంమో చెప్పలంటూ నిలదీశారు.. తను కులం కంటే గుణంకు ప్రాధాన్యత ఇస్తానని,,కులం గురించి పట్టించుకోను అంటూ స్పష్టం చేశారు..యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా,,ఆంద్రప్రదేశ్ ను పట్టి పిడిస్తూన్న వైసీపీ మహ్మరికి,,తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో వున్నాయన్నారు..రాబోయే ఎన్నికల్లో “జనసేన,,టీడీపీ కలసి అధికారంలోకి రావడం ఖాయం” అని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *