ప్రపంచ దేశాల సరసన సగర్వంగా భారత్-విజయవంతమైన GSLV- LVM3 ప్రయోగం

నెల్లూరు: భారతీయ శాస్త్రవేత్తలు అవిరళ కృషి నేటి ఉదయం ఫలించి,ప్రపంచ దేశాల సరసన సగర్వంగా చేరింది.ఇప్పటి వరకు PSLV రాకెట్ ద్వారా 2 టన్నుల లోపు బరువు వున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి తీసుకుని వెళ్లే శక్తి వుండేది..భవిష్యత్ ప్రయోగాలకు PSLV శక్తి చాలదు..కనీసం 5 టన్నుల నుంచి 10 టన్నుల బరువు వుండే ఉపగ్రహాలను నింగిలోకి తీసుకుని వెళ్లితే కాని,అమెరికా,రష్యా,చైనా సరసన చేరుకోలేము.ఇదే సమయంలో ప్రపంచం ఆర్దిక వ్యవస్థలో అభివృద్ది సాధించిన దేశంగా భారత్ నిలవాంటే,స్పేస్ టెక్నాలజీలో వ్యాపార పరమైన ప్రయోజనలు ఇమిడి వుండాలి.ఈ విషయాలను దృష్టిలో వుంచుకున్న కేంద్ర ప్రభుత్వం,2014 నుంచి ఇస్రోకు నిధుల కేటాయింపులను ఎక్కువ శాతంలో అందించింది.కొన్ని ప్రయోగాలు విఫలం అయినప్పటికి,శాస్త్రవేత్తలను వెన్ను తట్టి ప్రొత్సహించింది. దింతో మన శాస్త్రవేత్తలు రేయిపగలు కృషి చేసిన ఫలితం,న్యూ జనరేషన్ రాకెట్ ఉద్భవించింది.భారతీయుల శక్త,సమర్ధ్యాలను ప్రపంచ అవనికపై నేటి ప్రయోగంతో చాటిచెప్పింది.
భారతదేశ స్పెస్ టెక్నాలజీ చరిత్రలో తొలి సారిగా 5796 వేల టన్నుల బరువు వున్న 36 ఉపగ్రహాలను జియోసింక్రనస్ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం 00.07 గంటలకు లిఫ్ట్-ఆఫ్ జరిగింది.OneWeb యొక్క ఉపగ్రహాలు రాకెట్ నుంచి విజయవంతంగా వేరు చేయబడ్డాయి.కేవలం 1 గంట 15 నిమిషాల వ్యవధిలో తొమ్మిది దశల్లో ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.గ్రౌండ్ స్టేషన్ కు మొత్తం 36 ఉపగ్రహాల నుంచి సిగ్నల్ అందుకొవడం ప్రారంభమైనట్లు సమాచారం.
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(NISL),,ISRO,,బ్రిటన్ కు చెందిన One Web సంస్థల మధ్య ఒప్పందం మేరకు జరిగిన ప్రయోగంలో,ఇస్రో తొలిసారి ప్రపంచ వాణిజ్య విపణిలో అడుగుపెట్టింది.మరో 36 ఉపగ్రహాలను వచ్చే సంవత్సరం ప్రథమార్దంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ:-36 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి నూతన రికార్డులను నమోదు చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందలు తెలిపారు.
జనసేన: కొన్ని గంటల క్రితం అందరిక్షంలో అద్భుతాన్ని అవిష్కరించి,36 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి చారిత్రాత్మక విజయం సాధించిన ఇస్రోశాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్.