AMARAVATHITECHNOLOGY

శ్రీహరికోట నుంచి ఈ నెల 17వ తేదిన INSAT-3DS శాటిలైట్ ప్రయోగం

అమరావతి: ఈ నెల 17వ తేదిన 17:30 గంటలకు శ్రీహరికోట నుంచి GSLV-F14 ద్వారా INSAT-3DS శాటిలైట్ ను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ఇస్రో ప్రవేశ పెట్టనున్నది.. వాతావరణ మరియు విపత్తు హెచ్చరికలను INSAT-3DS ఉపగ్రహాం అందచేస్తుంది..ఈ మిషన్‌కు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) పూర్తిగా నిధులు సమకూర్చింది.. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) 51.7 మీటర్ల పొడవు గల లాంచ్ వెహికల్, మూడు-దశల్లో పేలోడ్ పనిచేస్తుంది..ఈ లాంచ్ వెహికల్ 420 టన్నుల బరువును మోసుకుని వెళ్లగలదు..

మొదటి దశ (GS1)లో 139-టన్నుల ప్రొపెల్లెంట్,,నాలుగు ఎర్త్-స్టోరబుల్ ప్రొపెల్లెంట్ స్టేజ్‌లు (L40) స్ట్రాపాన్‌లను కలిగి ఉండే సాలిడ్ ప్రొపెల్లెంట్ (S139) మోటార్‌ను కలిగి ఉంటుంది.. ఇవి ఒక్కొక్కటి 40 టన్నుల ద్రవ ప్రొపెల్లెంట్‌ను కలిగి ఉంటాయి.. రెండవ దశ (GS2) కూడా 40-టన్నుల ప్రొపెల్లెంట్‌తో లోడ్ చేయబడిన ప్రొపెల్లెంట్ దశ..మూడవ దశ (GS3) ద్రవ ఆక్సిజన్ (LOX),,ద్రవ హైడ్రోజన్ (LH2) యొక్క 15-టన్నుల ప్రొపెల్లెంట్ లోడింగ్‌తో వున్న క్రయోజెనిక్ దశ.. కమ్యూనికేషన్లు, నావిగేషన్, ఎర్త్ రిసోర్స్ సర్వేలకు సంబంధించి ఏదైనా ఇతర మిషన్‌ను నిర్వహించగల సామర్థ్యం గల వివిధ రకాల శాటిలైట్స్ ను ప్రయోగించడానికి GSLVని మోసుకుని వెళ్లుతుంది..

INSAT-3DS శాటిలైట్ సేవాలు:- 1-భూమి ఉపరితలాన్ని పర్యవేక్షించడానికి, వాతావరణ ప్రాముఖ్యత కలిగిన వివిధ మ్యాప్స్ ను సముద్ర మార్గాలలో పరిశీలనలతో పాటు పర్యావరణ ఆంశాలను పరిశీలిస్తుంది.. 2-వాతావరణం యొక్క వివిధ వాతావరణ పరిమితుల ప్రొఫైల్‌ను అందిస్తుంది..అలాగే డేటా కలెక్షన్ ప్లాట్‌ఫారమ్‌ల (DCPలు) నుంచి డేటాను సేకరణ,,డేటా యొక్క సామర్థ్యాలను అందిస్తుంది.. 3-శాటిలైట్ ఎయిడెడ్ పరిశోధన..రెస్క్యూ సేవలను అందిస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *