AMARAVATHIPOLITICS

2024లో జనసేన-టీడీపీ కలసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయం-పవన్

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు..

అమరావతి: 2024లో జనసేన-టీడీపీ కలసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయం అని అన్నారు.. వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది ముఖ్యనేతలు జనసేన పార్టీలో చేరారు.. పార్టీలో చేరినవారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నేను ఏదైనా మాటల్లో చెప్పను,, నిలబడి చేసి చూపిస్తానని అన్నారు.. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డామని, కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చామన్నారు.. ఒక కులాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు నడపలేమన్నారు.. సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టమని,, రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది తన ఉద్దేశమన్నారు.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా,, వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తు చేశారు..తాను ఇగోలకు వెళ్లలని, ఛాన్సులు తీసుకోదలచుకోలేదని,, ఏపీ ప్రజలు గెలవాలనుకుంటున్నానని అన్నారు…జనసేనలో చేరిన వారిలో చిలకలపూడి పాపారావు ( సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు – కృష్ణాజిల్లా), చిక్కాల దొరబాబు (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), పొగిరి సురేష్ బాబు (శ్రీకాకుళం జిల్లా వైసిపి నాయకులు),కలగ పాల్ పురుషోత్తం (తూర్పుగోదావరి వైసిపి నాయకులు),ఎదురువాక శ్రీ వెంకటగిరి (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), దుగ్గన నాగరాజ (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), వై. శ్రీనివాస్ రాజు (కడప జిల్లా వైసిపి నాయకులు) ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *