DISTRICTS

పార్లమెంట్ వ్యవస్థ గురించి యువత తెలుసుకోవడం ఎంతో అవసరం-కలెక్టర్

నెల్లూరు: ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ మనల్ని మనం పరిపాలించుకునే సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ ఎంతో దోహదపడుతోందని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నెహ్రూ యువ కేంద్రం ఆద్వర్యంలో నగరంలోని టౌన్ హల్లో జరిగిన మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ మనల్ని మనం పరిపాలించుకునే సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ ఎంతో దోహదపడుతోందని, ఈ అత్యున్నతమైన పార్లమెంట్ వ్యవస్థ గురించి యువత  తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. పార్లమెంట్ అంటే  ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే లోకసభ,,రాజ్యసభ అని, ఈ మూడు అత్యున్నతమైన వ్యవస్థలు కలిపితే అది ఇండియన్ పార్లమెంట్ అని అన్నారు. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి పార్లమెంట్ ద్వారా అమలౌతున్న చట్టాలన్నీకూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ అభివృద్దిలో భాగస్వాములు అయ్యే విధంగా అమలు జరుగుచున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఈ రెండు చాలా ముఖ్యమన్నారు. ఈ వ్యవస్థలపై యువతకు సంపూర్ణంగా అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా  నిర్వహించడం జరుగుచున్నదన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో అమలు జరుగుచున్న విధానపరమైన అంశాలను ప్రతి విధ్యార్ధి విద్యార్ధి దశ నుండే  గమనించడంతో పాటు అవగాహన కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ కళాశాలకు చెంది విద్యార్దిని,విద్యార్ధులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *