AMARAVATHIPOLITICS

ఇదొక దండుపాళ్యం బ్యాచ్ లా తయారు అయింది-పవన్ కళ్యాణ్

అమరావతి: పాస్ పోర్టు కావాలన్న,చిన్నపాటి ఉద్యోగానికైనా పోలీసు వెరిఫికేషన్ చేస్తారు,,వాలంటీర్ అనే సమాంతరం వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీసు వెరిఫికేషన్ చేయడం లేదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాని సూటిగా ప్రశ్నించారు..శనివారం పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ లో కోటగిరి.వరలక్ష్మి (72) అనే వృద్దురాలిని వాలంటీర్ కిరాతకంగా హత్య చేసి బంగారు నగలను ఎత్తుకెళ్లాడని ఆరోపించారు..వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్బంలో అయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తమ నవరత్నాల కోసం నియమించిన వాంటీర్ వ్యవస్థ ప్రజల ప్రాణాలను తీస్తొందని,,కొంత మంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు తెగబడుతొందని మండిపడ్డారు.వాళ్లు చేస్తున్న దురాగతాలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నయని,,బయటకు రాని నేరాలు చాలనే ఉన్నయన్నారు..ఇళ్లలోకి చొరబడి మరి సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు ఆసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత సమజసం అన్నారు..వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో,క్షేత్రస్థాయిలో వారు రెచ్చిపోతున్నారని,,ఇదొక దండుపాళ్యం బ్యాచ్ లా తయారు అయిందంటూ తీవ్రంగా విమర్శించారు..ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు పోలీసుల చేతులను కట్టేస్తున్నారన్నారని,, వాలంటీర్ చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు..విశాఖపట్నం నుంచే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ కల్యాణ్ సంచలనంగా వ్యాఖ్యలు చేశారు.. ఆంద్రప్రవేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతోందని, ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా చెప్పిందన్నారు..ఆంక్షలు తనకు మాత్రమేనా,, వాలంటీర్లకు ఉండవా అని ప్రశ్నించారు ఉత్తరాంధ్రలో 151 మంది చిన్నారులు అదృశ్యమయ్యారన్నారని,, శాంతిభద్రతలను, వ్యవస్థను కాపాడే బాధ్యత పోలీసులదేనని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *