AMARAVATHIDEVOTIONAL

ప్రత్యేక ప్రవేశదర్శనం (రూ.300) డిసెంబరు 22 నుంచి 4,23,500 టోకెన్లు విడుదల-టీటీడీ ఈవో ధర్మారెడ్డి

వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు..
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆఫ్ లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల వివరాలు:- రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుంచి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామని ఈవో తెలిపారు..(తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటుచేస్తామన్నారు)..
వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు..వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు..
నవంబరు నెలలో: శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 19.73 లక్షలు
హుండీ:- హుండీ కానుకలు – రూ.108.46 కోట్లు
లడ్డూలు:- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య– 97.47 లక్షలు
అన్నప్రసాదం:– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 36.50 లక్షలు
కల్యాణకట్ట:– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 7.06 లక్షలు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *