AMARAVATHIPOLITICS

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులేవు-సీ.ఎం రాజీనామ చేయాలి-జీవీఎల్

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పయని బీజెపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు..రాష్ట్రంలో ఇటీవల జరుగుతోన్న పలు నేరాల తీవ్రతపై అయన స్పందిస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై పూర్తి రిపోర్ట్ ఉందని తెలిపారు..విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై స్పందిచిన జీవీఎల్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు..విశాఖపట్నంలో భూ మాఫియా చేలరేగిపోతుందని ఆరోపించారు..విశాఖ భూ కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదంటూ ప్రశ్నించారు..సదరు రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి భూ సెటిల్మెంట్ లు చేస్తున్నారని అనుమానులు వస్తున్నయని ఆరోపించారు..బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషం అని,,వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం పెరిగిపొతుందని మండిపడ్డారు..వైసీపీ అంటే రాక్షస సంత అని వారు ప్రకటించుకుంటే,ప్రజలు తగు జాగ్రత్తల్లో వుంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..ఆంధ్రప్రదేశ్ లో ఇసుకు, మైనింగ్ పై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన అయన,,ప్రతిపక్షపార్టీలపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని నిశితంగా విమర్శించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *