AMARAVATHINATIONAL

మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతొంది-ప్రధాని మోదీ

అమరావతి: సామాన్యుల సమస్యల పరిష్కారానికి,,దేశ ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్  కార్యక్రమం అద్భుతమైన వేదికగా మారిందని ప్రధానమత్రి నరేంద్రమోడీ అన్నారు..అదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు..ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ప్రజల నుంచి తనకు వేల సంఖ్యలో లేఖలు, సందేశాలు వచ్చాయని, వాటిని చదువుతున్నప్పుడు భావోద్వేగాలకు లోనయ్యానని అన్నారు.. ఈ కార్యక్రమం వల్ల తాను అసామన్య సేవలు అందించిన పలువురు గురించి తెలుసుకున్నట్లుగా ప్రధాని మోడీ తెలిపారు..సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందన్నారు.. ఈ సందర్భంగా మహిళల సాధికారత కోసం పనిచేస్తున్న,మణిపూర్ కు చెందిన విజయశాంతిదేవితో ప్రధాని మోడీ ఫోన్ లో సంభాషించారు..తన ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుందని, ఇంతర దేశాల నుంచి  కూడా ఆర్డర్స్  వస్తున్నాయని విజయశాంతి తెలిపింది..అలాగే విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురుంచి కూడా ప్రధాని ప్రస్తావించారు.. భారతీయ వస్తువులే ప్రసాద్ ఎక్కువ ఉపయోగిస్తారని ప్రధాని అభినందించారు.. ఈ 100 ఎపిసోడ్ ద్వారా గత స్మృతులను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు..తాను గుజరాత్  సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ప్రజలను కలిసేవాడినని,,ఢిల్లీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు..తనకు చాలాసార్లు ఒంటరినని అనిపించిందని,,అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరగా ఉన్న అనుభూతి తనకు కలుగుతుందన్నారు… ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం తనని చాలా ప్రభావితం చేసిందని తెలిపారు..అక్టోబరు 3, 2014న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇండియాలో 22 భాషలు, 29 మాండలికాలతో పాటూ మన్ కీ బాత్ కార్యక్రమం ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలలో కూడా ప్రసారం అవుతుంది..ఆల్ ఇండియా రేడియోకు చెందిన 500కి పైగా ప్రసార కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలకు అందుతొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *