AMARAVATHINATIONAL

కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు యత్నం-కాల్చి చంపిన సైన్యం

క్రికెట్ అడుతున్న ఎస్.ఐపై కాల్పులు..
అమరావతి: జమ్మూకశ్మీరులోనికి,, కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు ఆదివారం రాత్రి యత్నించారు..ఆప్రమత్తంగా వున్నకేంద్ర భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయని ఆర్మీ అధికారులు తెలిపారు.. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు..ఇటీవల కాలంలో పాకిస్థాన్ నుంచి తరచూ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సరిహద్దుల్లో ప్రయత్నిస్తున్నరని,, చోరబాట్లను ఆరికట్టేందుకు సరిహద్దుల్లో తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయన్నారు..కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి,, పాకిస్థాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు కూడా గాయపడ్డారు.. పాక్ బలగాల కాల్పులను భారత సైన్యం అదే స్థాయిలో తిప్పికొట్టింది..సరిహద్దు గ్రామాలైన కథువా, సాంబా, రాజౌరి జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం 14,480 బంకర్లను నిర్మించింది..పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి కాల్పుల జరుగుతున్న నేపధ్యంలో జమ్మూకశ్మీరులోని ఆర్నియా ప్రాంతంలో ప్రజలు తలదాచుకునేందుకు బంకర్లను సిద్దం చేశారు..
లష్కరే తోయిబా ఉగ్రవాదులు:- ఇదే సమయంలో ఆదివారం శ్రీనగర్ ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న పోలీసు సబ్ ఇన్ స్పెక్టరును ఓ ఉగ్రవాది తుపాకీతో కాల్చి చంపారు.. ఎస్ఐను తామే కాల్చి చంపినట్లు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రకటించారు..పాక్ రేంజర్ల కాల్పులు, ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు, ఎదురుకాల్పుల సంఘటనలతో జమ్మూకశ్మీరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *