Close

నేష‌నల్ హెరాల్డ్ వార్తా సంస్థకు చెందిన కార్యాయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ

నేష‌నల్ హెరాల్డ్ వార్తా సంస్థకు చెందిన కార్యాయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ
  • PublishedAugust 2, 2022

అమరావతి: మనీలాండరింగ్ కేసులో భాగంగా నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ED) అధికారులు,,మంగళవారం ఢిల్లీ, ముంబైలో సోదాలు జ‌రుపుతున్నారు..ఢిల్లీలో నేష‌నల్ హెరాల్డ్ వార్తా సంస్థ కేంద్ర కార్యాలయం, ఇత‌ర‌ అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన సంస్థ‌ల్లో సోదాలు ముగిశాయి..ఢిల్లీలో మొత్తం 12 ప్రాంతాల్లో ED సోదాలు జరిపింది. ప్ర‌స్తుతం ముంబైలో సోదాలు కొన‌సాగుతున్నాయి.. నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీకి కూడా ED విచారించిన విష‌యం విదితమే..అనంత‌రం సోనియా గాంధీని విచారించింది..నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు YALకి బదలాయింపు, షేర్ల వాటాలు,ఆర్ధిక లావాదేవీల అంశాలపై ED అధికారులు ప్రశ్నించిన‌ట్లు తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published.