AMARAVATHIHYDERABAD

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

హైదరాబాద్: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జెండా వూపి ప్రారంభించారు..అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు..పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పాలన తీరును ఎండగట్టారు..రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని,,ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల అభివృద్ది పనులు ఆలస్యం అవుతుందన్నారు..అధికార పార్టీ పేరు ప్రస్తవించకుండానే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తీరును విమర్శించారు..తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు..తెలంగాణలో కుటుంబ పాలనకు విముక్తి కలగాలని అన్నారు..

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చార్జ్‎ల టెబుల్‎ను రైల్వే అధికారులు శనివారం విడుదల చేశారు..ఛైర్‌కార్‌ ఛార్జ్ రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛార్జ్ రూ.3080 వుంటుంది..తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.1625 నిర్ణయించారు..

వందేభారత్ ట్రైయిన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో అగుతుందని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు..ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతిలో చేరుకుంటుంది..తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702)….తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది..

సికింద్రాబాద్ నుంచి వివిధ స్టేషన్లకు ధరలు:- సికింద్రాబాద్ నుంచి నల్గొండ-రూ.470,,,సికింద్రాబాద్ నుంచి గుంటూరు-రూ.865,,,సికింద్రాబాద్ నుంచి ఒంగోలు-రూ.1075,,,సికింద్రాబాద్ నుంచి నెల్లూరు-రూ.1270,,,సికింద్రాబాద్ నుంచి తిరుపతి-రూ.1680,,,

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు:- సికింద్రాబాద్ నుంచి నల్గొండ-రూ.900,,,సికింద్రాబాద్ నుంచి గుంటూరు-రూ.1620,,,సికింద్రాబాద్ నుంచి ఒంగోలు-రూ.2045,,,సికింద్రాబాద్ నుంచి నెల్లూరు-రూ.2455,,,సికింద్రాబాద్ నుంచి తిరుపతి-రూ.3080.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *