AMARAVATHI

రైల్వే ప్రయాణికుల కోసం రూ.20, రూ.50 ధరలకే భోజనం

పలు రైళ్లు పొడిగింపు..
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికుల సౌకర్యార్దం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..వేసవి కాలంలో రద్దీని దృష్టిలో వుంచుకుని ప్రవేశ పెట్టిన పలు రైళ్లు ఆగష్టు 1 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది..పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా వున్నాయి..
హైదరాబాద్-కటక్-ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు,,కటక్-హైదరాబాద్-ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు,, తిరుపతి-జల్నా-ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు,,జల్నా-తిరుపతి-ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు,, జల్నా-చాప్రా-ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు,,చాప్రా-జల్నా-ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు,, హైదరాబాద్-గోరఖ్ పూర్-ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు,,గోరఖ్ పూర్-హైదరాబాద్-ఆగస్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ 1, 2023 వరకు సేవాలు అందిస్తాయి..
రూ.20, రూ.50 ధరలకే భోజన సదుపాయం:-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం, మంచినీటిని అందించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది..‘ఎకానమీ మీల్స్’ కార్యక్రమంలో భాగంగా,,, మొదటి రకం ఎకానమీ భోజనం రూ.20కు,, రెండో రకం కాంబో భోజనం రూ.50కు అందిచనుంది..ఎకానమీ భోజనంలో 7 పూరీలు, ఆలు కూర, పచ్చడిని అందిస్తారు. కాంబో భోజనంలో అన్నం, కిచిడీ, ఛోలే కుల్చే, ఛోలే భటూరే, పావ్ భాజీ, మసాలా దోశలను ఇస్తారు..భోజనంతో పాటు 200 ఎంఎల్ ప్యాకేజ్ డ్ మంచినీటి వాటర్ గ్లాసులను కూడా అంచేస్తారు..రైల్వే స్టేషన్లలో ఉన్న ఐఆర్ సీటీసీ కిచెన్ యూనిట్లు-జన్ ఆహార్ సర్వీస్ కౌంటర్ల ద్వారా భోజనాన్ని అందించేందుకు జనరల్ కోచ్ ల సమీపంలోని ప్లాట్ఫాంపై ఫుడ్ సర్వీస్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు..అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎకానమీ మీల్ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు..6 నెలల పాటు నాలుగు రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తామని,, అనంతరం ఇతర స్టేషన్లకు విస్తారిస్తామని పేర్కొన్నారు.వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *