దలైలామా భద్రతకు ముప్పు కలిగించేందుకు చైనా మహిళ కుట్ర

అమరావతి: బిహార్‌లోని బుద్ధ గయలో పర్యటిస్తున్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హని చేసేందుకు ఓ మహిళ కుట్ర పన్నినట్లు సమాచారం వున్నదని పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ చైనా జాతీయురాలని, ఆమె పేరు సోంగ్ షియావోలన్ అని తెలిపారు..చైనా గూఢచారిగా అనుమానిస్తున్న పోలీసులు, ఆమె రూపురేఖలతో కూడిన స్కెచ్‌ను విడుదల చేశారు..సదరు మహిళ బీహార్ లో వివిధ ప్రాంతాల్లో నివాసిస్తు,,ఒక దగ్గర స్థిరంగా నివాసం వుండడం లేదని బుద్దగయ పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు..టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గత గురువారం నుంచి బిహార్ లోని బుద్ధ గయలో పర్యటిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ళపాటు ఆయన ఈ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంలో పర్యటించలేదు. అంతకుముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. గత గురువారం ఆయనకు గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.