నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అమలుచేస్తున్న నూతన క్రీడా విధానంలో భాగంగా ఫిబ్రవరి నెలలో తిరుపతిలో రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈవో పుల్లయ్య బుధవారం తెలిపారు.. చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఈ నెల 21,24, 25 తేదీల్లో స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంపిక చేయడం జరుగుతాయన్నారు..ఈ క్రీడ ఎంపికల్లో పాల్గొనే బాల,బాలికలు 31-12-2022 నాటికి 15 సంవత్సరాల వయసు నిండి ఉండలన్నారు..జిల్లాస్థాయిలో ఎంపికలు క్రింద పేర్కొన్నతేదీలు వారీగా ఉంటాయన్నారు..ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఒరిజినల్స్ తో పాటుగా పై తేదీల్లో ఉదయం 9 గంటలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో చీఫ్ కోచ్ ని కలిసి పేర్లను,ఇతర వివరాలు నమోదు చేసుకోవాలన్నారు..ఎంపికైన జిల్లా జట్లకు రవాణా ఖర్చులు, క్రీడా దుస్తులు ఇతర ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరించి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు పంపడం జరుగుతుందని సీఈవో తెలిపారు.