AMARAVATHIDISTRICTS

మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ప్రమాదకరం-ప్రజారోగ్య వేదిక

నెల్లూరు: రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోతున్న మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఉత్తర్వు నెం-108లో పేర్కొన్న విధంగా వసూలు చేయబోతున్న సెల్ఫ్ ఫైనాన్స్ విధానం మాత్రం చాలా ప్రమాదకరమని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఉత్తర్వు ప్రకారం కొత్తగా పెడుతున్న ప్రభుత్వమెడికల్ కాలేజీలలో ఉన్న 15% సీట్లు కేంద్ర ప్రభుత్వ వాటాకి పోగా  మిగిలిన 85% సీట్లను 3 గ్రూపులుగా విభజించబడింది: 1) 50% జనరల్ సీట్లు 2) 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 3) 15% ఎన్ఆర్ఐ సీట్లు. ఒక్కో కేటగిరీకి సంబంధిత రుసుము సంవత్సరానికి జనరల్ కేటగిరీకి 15 వేల రూపాయలు, సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీకి 12 లక్షల రూపాయలు, మరియు ఎన్ఆర్ఐ కేటగిరీకి. 20 లక్షల రూపాయలుగా నిర్ణయించారని తెలిపారు.. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ రకమైన ఫీజుల వసూళ్లు చాలా ప్రతికూల పరిణామాలకు దారితీసి, వైద్య విద్య వ్యాపారం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..ఈ ఫీజు నిర్ణయం ప్రైవేట్ వైద్య కళాశాలల మాదిరిగానే ఉన్నదని,,ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల మధ్య వ్యత్యాసం లేకుండా చేస్తుందన్నారు..ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిధులు,,వనరులతో స్థాపించబడినప్పటికీ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వ నిర్వహణలోని వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు..”సెల్ఫ్ ఫైనాన్స్ రుసుము” విధానాన్ని పునఃపరిశీలించవలసిందిగా అభ్యర్థించారు..అలాగే ఇప్పటి వరకు అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *